Garbage Dumping Yard : మినీ చెత్త డంపింగ్ యార్డ్ని తలపిస్తున్న జయశంకర్ కాలనీ,ఎన్టీఆర్ నగర్

TRINETHRAM NEWS

దోమలు,ఈగలు విజృంభిస్తుండడంతో వ్యాధులు ప్రబలుతాయని భయాందోళన చెందుతున్న ప్రజలు.

స్థానిక కార్పొరేటర్ కి, జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 09 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ జయశంకర్ కాలనీ,ఎన్టీఆర్ నగర్ పరిధిలోని ప్రజలను పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోంది. భరించలేని దుర్వాసనతో మురికి కూపంలా తయారైంది. దోమలు దండయాత్రతో జనం అవస్థలు పడుతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు అయినా లేదని స్థానికులు మండిపడుతున్నారు.ఈ ప్రాంతంలోని వ్యర్థాలను పారిశుద్ధ్య అధికారులు ఇంతవరకు తొలగించలేదు. దీంతో వర్షం పడినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. ఎన్టీఆర్ నగర్ కాలనీ మజీద్,బెతెల్ గాస్పల్ చర్చ్ దగ్గర బ్లాక్ నెంబర్ 136,143,144,145 వీటి మధ్య ఖాళీ స్థలం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయాయి.

జిహెచ్ఎంసి అధికారులు చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ ఖాళీ స్థలంలోనే చెత్త వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మినీ చెత్త డంపింగ్ యార్డ్ని తలపిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో కాలనీల్లోని డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది.రాత్రి అయితే చాలు దోమల బెడదతో కాలనీవాసులు హడలిపోతున్నారు.చిన్నపిల్లలు,పెద్దవాళ్లు కూడా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీధుల్లోని చెత్తను శుభ్రం చేసే సిబ్బందే కరవయ్యారు. ఎన్టీఆర్ నగర్ మజీద్,బెతెల్ గాస్పల్ చర్చ్ దగ్గర అలాగే బ్లాక్ నెంబర్ 136,143,144,145 మధ్యలోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసినా అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక రాత్రి అయితే చాలు దోమల బెడదతో కాలనీవాసులు హడలిపోతున్నారు.దీనికితోడు కుక్కలు,పందులు,గేదెలు చెత్తను చిందరవందర చేసేస్తుండడందో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం రాజ్యమేలుతోంది.

దీనికి తోడు దోమలు, ఈగలు విజృంభిస్తుండడంతో అంటువ్యాధులు,జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.రహదారుల పైకి చెత్తాచెదారం చేరడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు,పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా కొంతమంది నివాసితులు తమ ఇళ్లలోని చెత్తను ఖాళీ స్థలం ఉన్న బ్లాక్ మధ్యలో వేసేస్తుండడంతో అవి వ్యర్థాలతో పేరుకుపోతున్నాయి.జిహెచ్ఎంసి అధికారులు పర్మినెంట్‌ పారిశుధ్య కార్మికులతో చెత్త లేకుండా శుభ్రం చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమవుతోందని జయశంకర్ కాలనీ,ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు వాపోతున్నారు.జిహెచ్ఎంసి అధికారులు ప్రజల గోడును ఆలకించి,చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇక్కడి స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jayashankar Colony, NTR Nagar,

You cannot copy content of this page

Scroll to Top