చెరుకుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థుల స్వరిపాలన దినోత్సవ సందడి!
ఎం ఈ ఓ. :— ఇస్లావత్ గోప్యా నాయక్.
డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 07, త్రినేత్రం న్యూస్. విద్యార్థులే పాలకులుగా మారి.. ఉపాధ్యాయులుగా పాఠాలు చెబుతూ.. అధికారులైన వారు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటే ఆ ప్రాంగణమంతా కొత్త వెలుగులు సంతరించుకుంది. డిండి(గుండ్ల పల్లి )మండల పరిధిలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శనివారం నిర్వహించిన ‘స్వపరిపాలన దినోత్సవం’ విద్యార్థుల ఉత్సాహం మధ్య ఘనంగా ముగిసింది.
పాలనా పగ్గాలు చేపట్టిన విద్యార్థులు:
పాఠశాల ఆవరణను ఒక మినీ సచివాలయంగా మార్చిన విద్యార్థులు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి అబ్బురపరిచారు.
- ముఖ్య నేతలు: హెడ్మాస్టర్‌గా సంజయ్, సీఎంగా తేజ, డిప్యూటీ సీఎంగా ప్రభాస్ బాధ్యతలు స్వీకరించారు.
- మంత్రులు: అంజలి (హోమ్ మంత్రి), నక్క అక్షిత్ (విద్యాశాఖ మంత్రి) తమ శాఖలపై పట్టు ప్రదర్శించారు.
- అధికార యంత్రాంగం: జిల్లా కలెక్టర్‌గా ముస్కాన్, జేసీగా ముచ్చర్ల ఆరాధ్య, డిప్యూటీ కలెక్టర్‌గా మౌనిక తమదైన శైలిలో పాలన సాగించగా.. డీఈఓగా నక్క నితీష, ఎంఈఓగా ఇస్లావత్ చరణ్ విద్యాశాఖ విధులను పర్యవేక్షించారు.
- ప్రజా ప్రతినిధులు: ఎంపీగా చందన, ఎమ్మెల్యేగా రాంచరణ్, సర్పంచ్‌గా నిఖిల్ ప్రజల ప్రతినిధులుగా తమ గళం వినిపించారు.
నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి: ఎంఈఓ ఇస్లావత్ గోప్యా నాయక్
ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ఇస్లావత్ గోప్యా నాయక్ మాట్లాడుతూ, విద్యార్థులకు పాలనా వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికలని కొనియాడారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించడం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని మెచ్చుకున్నారు.
ఈ వేడుకలో ఇంచార్జీ హెడ్మాస్టర్ భూక్య నాగేశ్వరరావుతో పాటు ఉపాధ్యాయ బృందం లింగయ్య, లక్ష్మీ, సర్దార్ సింగ్ రాథోడ్, వేణు, శ్రీనివాస్, శ్రీనయ్య, శోభన్ బాబు, వాసవి, పుష్పలత, సిబ్బంది రవూఫ్, శ్రీనివాసులు, కాశమ్మ, యాదమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, సామాజిక బాధ్యతలను కూడా తెలుసుకున్నారని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


