Sekhar Reddy : పల్లె దవాఖానాలో జన ఆరోగ్య సమితి సమావేశం
ఆరోగ్య మహిళ పరీక్షలు తప్పనిసరి చేయాలి .
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్ .
చింతపల్లి ఫిబ్రవరి 02 త్రినేత్రం న్యూస్. మహిళలకు ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని పల్లె దవాఖానానలో జన ఆరోగ్య సమితి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగాఆమెమాట్లాడుతూ ఆరోగ్య దవాఖానాలో నిర్వహిస్తున్న ఆరోగ్యమహిళావైద్యపరీక్షలనుపరిశీలించారు.
మహిళలకు బీపీపరీక్ష చేయించి వివరాలుఅడిగితెలుసుకున్నారు. ప్రతి మహిళ ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు చేయించుకునేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు. బిపి,షుగర్ వ్యాధి ఉన్నవారికి పల్లె దవాఖానా నుంచి ప్రతి నెల మందులుఅందజేయాలని తెలిపారు.రక్తహీనత ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఐరన్,క్యాల్షియం వంటి మాత్రలుఅందజేయాలని,ఐరన్ సమకూరే ఆహారాన్ని సూచించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతిరమణారావు,ఉలుపాల శేఖర్ రెడ్డి,తీదేడు గ్రామ శాఖ అధ్యక్షుడు సోనగంటి గొవర్థనాచారి, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్, మర్లయాదగిరి,శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామస్తులుసిమర్లశ్రీనుయాదవ్, మెరికశంకరయ్య,వీరమల్లజగదీష్, దాసరిమల్లయ్య, వీరమల్లవెంకటయ్య, మొరుపోజురాజు, కాయితిబుచ్చిరెడ్డి, కర్ణకోటకిషన్, కలగోనికిరణ్,మునగాల అశోక్, డాక్టర్ శ్రీదేవి, ఏ ఎన్ ఎం రామలక్ష్మి,అంగన్వాడి టీచర్లు,ఆశావర్కర్లు,గ్రామస్తులుసిబ్బందితదిరులుపాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

