E-autos Launched : ఇంటింటా చెత్త సేకరణకు ఈ-ఆటోలు ప్రారంభం

TRINETHRAM NEWS

అరకులోయ, ఫిబ్రవరి 21, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలక చర్యలు చేపట్టారు. స్వచ్ఛ భారత్–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి జిల్లాకు నాలుగు ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు, చెత్త సేకరణకు అవసరమైన ప్లాస్టిక్ డస్ట్‌బిన్లు అందాయి.
ఈ వాహనాలను శుక్రవారం పాడేరు ఐటిడిఎ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సహాయ కలెక్టర్ కె. సాహిత్, పాడేరు ఇన్‌చార్జ్ ఆర్డీఓ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు తదితర జిల్లా అధికారులతో కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటి వద్ద నుంచే చెత్త సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం ముఖ్యమన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, శాస్త్రీయ విధానంలో నిర్వహించడం ద్వారా గ్రామాలు స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా మారుతాయని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు గ్రామసచివాలయాల జిల్లా నోడల్ అధికారి పి.ఎస్. కుమార్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

E-autos launched for door-to-door garbage collection

You cannot copy content of this page

Scroll to Top