Garbage Collection : పప్పుడువలసలో ఇంటింటికి చెత్త సేకరణ

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ సెప్టెంబర్ 19, (త్రినేత్రం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం భాగంలో అరకువ్యాలీ మండలం చొంపి గ్రామపంచాయితీ పరిధిలోని పప్పుడువలస గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం కింద బుధవారం ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
సర్పంచ్ కురడబోయిన సుభద్ర, ఎంపీటీసీ జానకి, పంచాయతీ సెక్రటరీ ఫరోక్ ఆదేశాల మేరకు వార్డు సభ్యురాలి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుడు రామకృష్ణ ఇంటింటికి చెత్త సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సన్యాసమ్మ, (త్రినేత్రం న్యూస్ రిపోర్టర్ రాజు) గ్రామస్తులు. కొండమ్మ, గౌతమి, గంగమ్మ, పోలమ్మ, కొండలరావు, సన్నీ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పంచాయితీ వారు గ్రామస్థులకు సూచిస్తూ ఎవరి ఇంటి చెత్తను వారు ఒకేచోట సేకరించి ఉంచాలి. ఇంటి ముందల డ్రైనేజీల్లో చెత్త వేయకూడదు. డ్రైనేజీలో చెత్త వేయడం వలన నీటి నిల్వలు ఏర్పడి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.
“మన ఆరోగ్యం, మన పరిశుభ్రత మన చేతుల్లోనే ఉంది” అని పంచాయితీ సభ్యులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అలాగే,సూచనలను పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Door-to-door garbage collection

You cannot copy content of this page

Scroll to Top