Mon. Mar 9th, 2026

Resolve Employee Issues : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మూడో శుక్రవారం గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి

TRINETHRAM NEWS

అరకులోయ ఫిబ్రవరి 21, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాడేరు ఇంచార్జ్ ఆర్డీవో ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్‌లో కలెక్టరేట్ పరిపాలన అధికారితో కలిసి ఆయన అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, సచివాలయ మరియు ఇతర శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించారు.
స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన విఆర్ఓల ప్రమోషన్ల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
ఉద్యోగుల సమస్యలను పారదర్శకంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ గ్రీవెన్స్ వేదిక ఉపయోగపడుతుందని, ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ పరిపాలన అధికారి కె. ప్రసాదరావు, వివిధ శాఖల అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

utilized to resolve employee issues

Related Post

You cannot copy content of this page