Mon. Mar 9th, 2026

Chittam Murali : ఏజెన్సీలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలి జనసేన మండల అధ్యక్షుడు చిట్టం నాయక్ మురళి హెచ్చరిక

TRINETHRAM NEWS

అరకులోయ,ఫిబ్రవరి 21, త్రినేత్రం న్యూస్: ఏజెన్సీ ప్రాంతంలోని ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం నాయక్ మురళి తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల బాక్సయిట్ తవ్వకాల అంశంపై మళ్లీ అపోహలు సృష్టిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2018 సంవత్సరంలోనే రద్దు చేసిన బాక్సయిట్‌కు సంబంధించిన జి.ఓ.ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో గందరగోళం సృష్టించాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. జిల్లా మైనింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పష్టమైన వివరణలు ఇస్తున్నప్పటికీ, కొన్ని వర్గాలు కావాలనే అపార్థాలు వ్యాప్తి చేసి అమాయక ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో హత్య రాజకీయాలు, రగడ రాజకీయాలకు తెరతీయొద్దని ఆయన సూచించారు. ప్రశాంతంగా జీవిస్తున్న ఆదివాసీ సమాజంలో చిచ్చుపెట్టి లాభాలు పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అబద్ధపు ప్రచారాలతో వసూళ్లకు తెరలేపి భవిష్యత్ తరాల హక్కులను దోచుకునే బ్యాచులు సిద్ధమవుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఆదివాసీ సమాజాన్ని అదోగతి పాలు చేయవద్దని హెచ్చరించారు.
ఆదివాసీ ప్రజలు మేధావులని, నిజానిజాలను గుర్తించే సామర్థ్యం ఉన్నవారినని మురళి పేర్కొన్నారు. అపోహలను నమ్మకుండా అధికారుల అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు. సమాజాన్ని మేల్కొలిపి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయ లాభాల కోసం ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లర్ల బాట పట్టించాలనే యత్నాలను ఖండిస్తూ, ప్రశాంతతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిట్టం నాయక్ మురళి స్పష్టం చేశారు. ప్రజలు ఐక్యంగా ఉండి, తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chittam  Murali warns against false propaganda in the agency

Related Post

You cannot copy content of this page