ముంచంగిపుట్టు, డిసెంబర్ 25, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం పాత సుజన కోట గ్రామంలో తక్షణమే ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగడ జగన్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామాన్ని సందర్శించి మహిళలతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పాత సుజన కోట గ్రామం పైభాగంలో కొండ, దిగువ భాగంలో డుడుమ రిజర్వాయర్ గడ్డ మధ్య ప్రాంతంలో సుమారు 100కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. అయితే గ్రామంలో ఇప్పటివరకు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో మరుగుదొడ్లు లేకపోవడం కారణంగా మహిళలు బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది వారి గౌరవం, భద్రత, ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదంగా మారిందని అన్నారు, ఈ పరిస్థితులు మహిళల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు.
కావున స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో మరియు జిల్లా కలెక్టర్ స్పందించి, తక్షణమే చర్యలు తీసుకుని పాత సుజన కోట గ్రామంలో ప్రజా మరుగుదొడ్లను నిర్మించాలని కోరారు. మహిళల ఆరోగ్యం, గౌరవం, భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి సత్వర చర్యలు ఆశిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్. పద్మవతి, వి. వరహాలమ్మ, సిహెచ్. కౌసల్య, వి. అరుణ, ఎన్. మల్లీశ్వరి, వి. అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


