కూకట్పల్లి ఫిబ్రవరి 26 (త్రినేత్రం న్యూస్) : ఈ రోజు ఉదయం మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ సమీపంలోని సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సైబరాబాద్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు –సామాజిక న్యాయం, పారదర్శక పాలన, యువతకు అవకాశాలు మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
“జనసేన ఉద్యమి” కార్యక్రమం ద్వారా పార్టీకి కట్టుబడి పనిచేసే క్రియాశీలక సభ్యులను తయారు చేసి, గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు బలమైన సంస్థాగత నిర్మాణం చేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జనసేన సాదక్ బాధ్యతలు, వారి పాత్ర, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, సభ్యత్వం ద్వారా ఉద్యమిలను పార్టీ లోకి ఆహ్వానించి పార్టీనీ బలోపేతం చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కార్పొరేషన్ జనసేన నాయకులు నందగిరి సతీష్, బొర్రా వెంకట్ అప్పారావు, కొల్లా శంకర్, వేముల మహేష్, కిషోర్ నాగరాజు, మండలి అనిల్,బడే విశ్వేశ్వర్ రావు,కలిగినీడి ప్రసాద్, పోలేబోయిన శ్రీనివాస్, చిట్టి బాబు,ప్రభు చైతన్య,రణదీప్,సుదర్శన్,రాము, మురళి , పులగం సుబ్బు, అప్పారావు, మాధవి ,ప్రదీప్, మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


