Prema Kumar : “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్” లో పాల్గొన్న జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 20 : ఈ రోజు బంజారాహిల్స్ లోని చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జయంతి వేడుకలలో భాగంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు సూర్య తేజ, పంతం పవన్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రత్యేక అతిథిగా పాల్గొని
రిబ్బన్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం ఒక మహోన్నతమైన సేవ అని యువత రక్తదానంలో ముందుండాలని, సమాజం కోసం నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ప్రేమ కుమార్ ని నిర్వాహకులు శాలువాతో సత్కరించి, ఆయన సమాజానికి చేసిన సేవలు, రాజకీయాల్లో పాటిస్తున్న విలువలు, అందరికీ ఆదర్శప్రాయమని నిర్వాహకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కలిగినీడి ప్రసాద్, అడబాల షణ్ముఖ, పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు, మరియు కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mega Blood Donation Camp

You cannot copy content of this page

Scroll to Top