ఏలూరు జిల్లా : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం, అన్నవరం గ్రామ కార్యదర్శి నల్లగొర్ల రాధా మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాలలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైనటువంటి వాళ్లందరూ కు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు.
ఒకవేళ ఎవరికైతే లేదో వాళ్లను గుర్తించి ఆ పథకాలను అందించామని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడం మా అదృష్టమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక గ్రామంలోనే కాకుండా రాష్ట్రమంతటా ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా ప్రభుత్వ సమయం ప్రకారం విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
మళ్లీ మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. శాసనసభ్యులు , మంత్రి కొలుసు పార్థసారథి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని మా దృష్టికి తీసుకు వస్తున్నారని, ప్రతి శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తక్షణమే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తున్నామని అన్నారు.
మా సిబ్బంది మేము ప్రజల్లో మమేకమై వాళ్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. డ్రైనేజీ, వీధి దీపాలు, సిసి రోడ్లు, మంచినీరు తదితర అంశాలపై వివరించి చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలుపుతున్నారని ప్రశంసించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


