Coalition Government : కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS
coalition government is committed

Coalition Government : త్రినేత్రం న్యూస్ : భీమవరం : ఏప్రిల్ 04; జిల్లా కేంద్రమైన భీమవరం , మండలం, అనాకోడేరు గ్రామంలో భీమవరం నుంచి ఎల్.వి.ఎన్ పురం రోడ్డు వయా కోమరాడ – అనాకోడేరు కు రూపాయలు 2.89 కోట్లతో అదేవిధంగా వెంప గ్రామంలో మొగుల్తూరు నుంచి భీమవరం వయా వెంప రోడ్డు వరకు రూపాయలు 2.80 కోట్లతో శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు) శంకుస్థాపన చేశారు.
పట్టణాల నుంచి గ్రామాల వరకు రోడ్లు అనుసంధానం పై దృష్టి సాధించామని ఆయన తెలిపారు. అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందని, సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. మొత్తం రూపాయలు 5.69 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగిందని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top