
Attacks on Dalits : త్రినేత్రం న్యూస్, మండపేట, నర్సీపట్నంలో గౌరవనీయమైన స్పీకర్ పదవిలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, దళితునిపై పోలీసుల సమక్షంలో బహిరంగంగా దాడి చేసిన ఘటన తీవ్రంగా ఖండించదగినదని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం వ్యక్తిగత తప్పు కాకుండా ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే అహంకారానికి నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, నియోజకవర్గ కన్వీనర్ నక్క సింహాచలం, ఆర్టీఐ కన్వీనర్ మందపల్లి రవికుమార్, ముమ్మిడివరపు బాపిరాజు, ఎంపీటీసీ పలివెల మధు, పార్టీ నాయకులు తవిటికి రత్నకుమార్, కొడమంచిలి భాస్కర్, నాతి పట్టాభి, కోణాల సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారే దళితులపై దాడులు చేయడం అత్యంత దురదృష్టకరమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, కులమత విభేదాలను రెచ్చగొట్టే చర్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కానీ అధికారంలో ఉన్నవారే వాటిని కాలరాస్తున్నారని విమర్శించారు.
వారి ప్రధాన డిమాండ్లు:
ఘటనపై తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరపాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బాధితుడికి రక్షణ, న్యాయం కల్పించాలి
దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
స్పీకర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే మండపేటలో ఎస్టీ కులానికి చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ రాము నుండి అనుమతుల కోసం లంచం అడిగి, రూ.1,50,000 తీసుకున్నారని ఆరోపణలు ఉన్న మున్సిపల్ కమిషనర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు కూడా పెరుగుతున్నాయని పేర్కొంటూ, దళిత హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు” అని నాయకులు స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

