Anji Babu Birthday : ఆత్మీయుల స‌మ‌క్షంలో అంజిబాబు జ‌న్మ‌దిన వేడుక‌లు

TRINETHRAM NEWS
Anji Babu Birthday Celebrations

శుభాకాంక్ష‌లు తెలిపిన మిత్రులు. ఆచార్యులు, అధ్యాప‌కుల ఆశీస్సులు.

Anji Babu Birthday : కూకట్పల్లి మార్చి 29 ( త్రినేత్రం న్యూస్) : సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అంజిబాబు నాగుల జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. సుర‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి తెలుగు వ‌ర్సిటీలో జ‌ర్న‌లిజంలో ఉన్న‌త విద్య అభ్య‌సిస్తున్న ఆయ‌న‌కు మిత్రులు శుభాకాంక్ష‌లు తెలిపారు. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మిత్రులు,ఆత్మీయులు అంజిబాబుతో కేకు క‌ట్ చేయించి వేడుక జ‌రిపారు. నిండునూరేళ్లు ఆరోగ్యంగా,ఆనందంగా జీవించాల‌ని కోరుకుంటూ అభినందించారు.

అనంత‌రం వ‌ర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హ‌నుమంత‌రావు, జాన‌ప‌ద విభాగం డీన్ విజ‌య్ పాల్‌, జ‌ర్న‌లిజం అధ్యాప‌కులు డా.షేక్ హ‌సీనా, షేక్ ష‌మీర్, గోపాల్ ఇత‌ర పెద్ద‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఆశీర్వాదాలు అందుకున్నారు. అంద‌రితోనూ ఆత్మీయంగా, క‌లివిడిగా ఉండే అంజిబాబుకు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి. “స్నేహశీలి, అనుబంధం ఆత్మీయతలు కలగలసిన స్వచ్చమైన ప్రేమ ఆప్యాయతలు పంచే నిత్యసంతోషి సోదరుడు అంజిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ దేవుని ఆశీస్సులు నిత్యం నీపై ఉండాలని,నీ చదువులో, వృత్తిలో, పని పాటల్లో విజయాలను ఆస్వాదిస్తూ అనేక పుట్టినరోజులు సుఖసంతోషాలతో జరుపుకోవాలని,మీ కుటుంబం ఫలించి విస్తరించాలని, దేవుని కృప నిండుగా మీకు ఉండాలని ఆశిస్తున్నా..” అంటూ న్యాయ‌వాది, జ‌ర్న‌లిస్టు మిత్రుడు కొండూరి కోటిబాబు, “హ్యాపీ బర్త్డే అంజిబాబు ఎంసిజె అన్నయ్య” అంటూ ల‌వ‌న్‌కుమార్‌, “మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే అంజిబాబు సార్ ..

” అంటూ జ‌ర్న‌లిజం మిత్రురాలు వై.న‌దియా,”మంచోడు, మృధు స్వభావి, సెల్ఫీ స్టార్ అంజిబాబు బ్రదర్ కు హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ తెలుగుప్ర‌భ డిప్యూటీ చీఫ్ రిపోర్ట‌ర్ ప్ర‌శాంత్‌, అలాగే.. స్నేహ‌శీలి.. స్వచ్ఛమైన మనసు.. మనిషి అయిన అంజిబాబుకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఇత‌ర మిత్రులు,ఈనాడు,ఆంధ్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణకు చెందిన కొంద‌రు జ‌ర్న‌లిస్టు మిత్రులు అంజిబాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే మిత్రుడు, వివేకానంద్ న‌గ‌ర్‌లోని ఏరువాక టిఫిన్ సెంట‌ర్ నిర్వాహ‌కుడు అనిల్ అంజిబాబుకు హృద‌య‌పూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top