
Sanctioned Road : త్రినేత్రం న్యూస్ : ఏలూరు : ఏప్రిల్ 04 ; ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం , గోదావరి కెనాల్ లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో దెందులూరు నియోజకవర్గం శివారు ప్రాంతాలకు సాగు మరియు త్రాగునీటి సరపరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది.
అదేవిధంగా నియోజకవర్గంలో గతంలో మంజూరైన రోడ్ల పనులు సకాలంలోనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సమావేశంలో పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు కూడా పాల్గొన్నారు.

