దేవరకొండ డివిజన్ నవంబర్ 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ లో డిండి రోడ్డు మీనాక్షి చౌరస్తా నుండి మైనం పల్లి వాగు బ్రిడ్జి వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు రోడ్డు పనులు మొదలుపెట్టి ఆరు నెలలు గడిచిన ఇంకా తారు పరచకపోవడం గమనార్హం. పట్టణవాసులు వాహనదారులు ప్రయాణికులు కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఉదయం సాయంత్రం స్కూల్ టైమింగ్ లో విపరీతమైన దుమ్ములో ముందు వెళ్తున్న వాహనాలు కనబడకుండా తయారై ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు విపరీతమైన దుమ్ముతో హనుమాన్ నగర్ ,అయ్యప్ప నగర్ ,తాటి కోల్ రోడ్డులో గల ఇండ్లపై విపరీతమైన దుమ్ము చేరుతుందని మహిళలు చెబుతున్నారు
ఈ రూట్లో వెళ్లాలంటే చిన్నచిన్న కంకరల్లో కళ్ళల్లో పడుతున్నాయని వాహనదారులు అంటున్నారు ఈ రోడ్డు వెంట వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు దుమ్ము ధూళి వల్ల ఇబ్బంది పడుతున్నామని త్వరగా తారువేయాలని అధికారులను కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


