Collector : మెడికల్ క్యాంపు లో పాల్గొన్న కలెక్టర్

TRINETHRAM NEWS
Collector participated in the medical camp

Collector : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 28: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం లో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. తడి పొడి చెత్త నిర్వహణపై ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించింది.

ఆమె మాట్లాడుతూ పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా మెడికల్ క్యాంపును ప్రారంభించి పలువురు శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో స్వచ్ఛ స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top