ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
AIYF Conference

ఎనమల్ల నవీన్ .

AIYF Conference : డిండి( గుండ్ల పల్లి) ఆగష్టు 10, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ ప్రజాభవన్ లో సోమ వారం జిల్లా మహాసభల కరపత్ర ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత యువజన సమాఖ్య నల్లగొండ జిల్లా 15వ మహాసభను ఆగస్టు 13 గురువారం రోజు మునుగోడు నియోజకవర్గంలోని సత్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుంది .

కావున మండలంలోని ఏఐవైఎఫ్ నాయకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క మహాసభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదట ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది.కానీ రెండున్నర సంవత్సరాల కాలంలో 55 వేల 143 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం 5 లక్షల యువతి యువకులు ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటి వరకు రుణ సదుపాయం కల్పించకుండా యువతను మోసగించడం జరుగుతుంది.

వెంటనే రాజీవ్ యువ వికాసం పథకానికి నిధులు విడుదల చేసి యువతను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ డిండి మండల అధ్యక్ష కార్యదర్శులు కాంపల్లి ప్రవీణ్,ఎలిమినేటి నరేష్, కోశాధికారి నాయక్ మధుకర్,ఉపాధ్యక్షులు నూనె భూపాల్,మాజీ అధ్యక్షులు ఆర్కపల్లి మహేష్,డేగ అనిల్, నాగార్జున్,నూతనగంటి అంజి,చంటి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page