సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 07 , త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో పదవ వార్డులో పోటీ చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అభ్యర్థి జూలూరి మమత జ్యోతిబసు కు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
శనివారం 10వ వార్డులో డప్పు కళాకారులతో పార్టీ నాయకులతో భారీ ర్యాలీతో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరారు.అనంతరం వారు మాట్లాడుతూ… ప్రజల కోసం నిత్యం పోరాడే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా వార్డ్ సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గాలపై వత్తిడి తీసుకొచ్చి పరిష్కరిస్తారని అన్నారు.
నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని గెలిపిస్తే వార్డు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని పేర్కొన్నారు.
ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధతగల సిపిఐ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి అహంకారులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు, అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని సామాన్యుల ముంగిట సంక్షేమ ఫలాలు చేరడం అని నిత్యం ప్రజలతో మమేకమై ఉండే సిపిఐ కి ప్రజా సమస్యలపై ఎక్కువగా అవగాహన ఉంటుందని అలాంటి అభ్యర్థులే కౌన్సిలర్ గా ఉండటం ద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందని, ఎన్నికల సమయంలో పూటకో పార్టీ మారుతూ నిమిషానికో కండువా కప్పుకునే కంత్రి గాళ్లు మీ వద్దకు వస్తుంటారని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ముఖం చాటేస్తారని అలాంటి వారి పట్ల ప్రజలంతా అప్రమంతంగా ఉండాలన్నారు.
ప్రశ్నించే గొంతుక సిపిఐ అభ్యర్థిని గెలిపిస్తే నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తారని అన్నారు. పదో వార్డ్ ప్రజలు మమతా జ్యోతిబసు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


