
—కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్లను ప్రకటించాలి… .ఎనమల్ల నవీన్
Enamalla Naveen : డిండి( గుండ్ల పల్లి) జులై 28, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని తవక్లాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి అఖిల భారత యువజన సమాఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికిముఖ్యఅతిథిగా అఖిలభారత యువజన సమాఖ్య నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ విచ్చేసి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
యువతను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చి ఇప్పటికి నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్లను ప్రకటించాలి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని లేని పక్షంలో యువతను చైతన్యం చేసి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షులుగా ఎండీ బాబర్,కార్యదర్శి ఎండీ ఆదిల్,ఉపాధ్యక్షులు భూషరాజు రమేష్,సహాయ కార్యదర్శి కడారి వెంకటేష్,కోశాధికారి మీనుగా నవీన్ లను ఎన్నుకోవడం జరిగింది. ఏఐవైఎఫ్ డిండి మండల అధ్యక్షులు ఎలిమినేటి నరేష్,సిపిఐ తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి,సైదులు, మహేష్, శ్రీను, మల్లేష్, నాగరాజు, మహేష్, జంగయ్య, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe