
నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం.
కల్లూరు ధర్మేంద్ర, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి .
AIYF : డిండి (గుండ్ల పల్లి) జులై 31, త్రినేత్రం న్యూస్. నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని, దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉద్యోగ హక్కు కోసం యువత సంఘటితం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఎఐవైఎఫ్ డిండి మండల 15వ మహాసభ స్థానిక యెలకుర్తి జైపాల్ గార్డెన్స్ లో ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏనమల్ల నవీన్ అధ్యక్షతన జరిగింది. మహాసభల సూచికగా యువజన సంఘ జెండాను ఎఐవైఎఫ్ నల్గొండ జిల్లా కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు ఎగురవేశారు.
ఈ సందర్బంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర. మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు . ప్రభుత్వ శాఖల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాలు సకాలంలో పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ విధానాల వల్ల శాశ్వత ఉద్యోగ అవకాశాలు తగ్గి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు . ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనను హక్కుగా కాకుండా ఎన్నికల హామీలకే పరిమితం చేస్తున్నాయని విమర్శించారు .
అదేవిధంగా ఎఐవైఎఫ్ నల్గొండ జిల్లా కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యువత సంఘటితమై ఉద్యమించాల్సిన అవసరం ఉందని, అందుకే నేడు ఏ ఐ వై ఎఫ్ డిండి మండల మహాసభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు . ప్రభుత్వ ఖాళీల భర్తీ, యువత హక్కులు తదితర అంశాలపై తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు . రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి,జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఎండి మైనోద్దీన్, సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి, సహాయ కార్యదర్శులు బొల్లె శైలేష్,తిప్పర్తి విజేందర్ రెడ్డి,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్ కుమార్,ఎఐవైఎఫ్ రాష్ట్ర నేత కాంపల్లి కళ్యాణ్,ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఉదయ్ డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్,ఎఐవైఎఫ్ మండల అధ్యక్షుడు, కార్యదర్శి ఎలిమినేటి నరేష్,ఆర్కపల్లి నరేష్,కోశాధికారి నాయక్ మధుకర్,సభ్యలు వెంకటేష్,శివ,అనీల్,ప్రవీణ్,నాగార్జున్,ఆంజనేయులు,గణేష్,ఆదిల్ పాషా, అన్వేష్,వెంకటేష్,రియాజ్ బాలు,లోకేష్,ఎండీ బాలపిర్,కుంభం కొండల్,మల్లేష్,వెంకటేష్, సజీవ్,రమేష్,శివ కుమార్,హరికృష్ణ, సంజయ్,దేవేందర్, సైదులు,జనార్దన చారి , యువజన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe