సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
Ramavat Ravindra Kumar

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

Ramavat Ravindra Kumar : చింతపల్లి ఆగష్టు 30, త్రినేత్రం న్యూస్. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలని, అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో తిరుమణి పాపయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర, ఉత్సవాల్లో రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… ముత్యాలమ్మ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు, భక్తులందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.ప్రజలందరూ ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో అమ్మవారి జాతర, ఉత్సవాలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలకు, భక్తులకు ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, కేతావత్ బిల్య నాయక్, స్థానిక సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి, దేన్యతండ గ్రామ సర్పంచ్ రమావత్ కొండల్ నాయక్, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తులసిరాం, బాలు, మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్, దండేటికార్ ప్రసాద్, కాయితి బచ్చిరెడ్డి, మర్రు శ్రీనివాస రావు, మర్రు సురేందర్ రావు, శివర్ల పర్వతాలు యాదవ్, దాసరి తిరుపతయ్య, తిరుమణి వెంకటయ్య, దాసరి ముత్తయ్య తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page