సెప్టెంబర్ 29, 2026
TRINETHRAM NEWS
Village Development

Village Development : చింత పల్లి సెప్టెంబర్ 28, త్రినేత్రం న్యూస్. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.తీదేడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో VB–G RAM–Gపై గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపాధి అవకాశాలు, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతులపై గ్రామస్థులతో చర్చించారు.తీదేడు గ్రామ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం.

గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తాం.గ్రామ సభలో ప్రజలు తమ సమస్యలు, అవసరాలను స్వేచ్ఛగా తెలియజేయాలి. ప్రజల సూచనలతో పారదర్శకంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.గ్రామ సభలో గ్రామస్థులు పాల్గొని పలు సమస్యలు, అభివృద్ధి అవసరాలను పంచాయతీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్, మర్ల యాదగిరి, శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్,గ్రామస్తులు సిమర్ల శ్రీను యాదవ్,చింతకుంట్ల రాకేష్,బెక్కం శ్రీను,తిరుమని యాదయ్య,వలమోని వెంకటయ్య,ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రయ్య,అంగన్వాడి టీచర్లు, ఏ.యన్.యం లు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

1000 క్రిస్టల్ బీడ్స్‌తో కూడిన 7 చక్రా ట్రీ! మీ ఇంట్లోకి అదృష్టాన్ని మరియు పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page