
- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో “వీల్స్ అండ్ మీల్స్” కార్యక్రమం.
- రోగులకు వారి సహాయకులకు కిచిడి అందించిన గాజుల రాజేష్-ఉషారాణి కుటుంబ సభ్యులు.
Free Breakfast : దేవరకొండ డివిజన్ నవంబర్ 13, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. లయన్స్ క్లబ్ దేవరకొండ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “వీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 300 మంది రోగులు వారి సహాయకులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు. కీర్తిశేషులు గాజుల సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు గాజుల రాజేష్ ఉషారాణి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
–దాతల సహకారంతో నిరంతర సేవ:-
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ”వీల్స్ అండ్ మీల్స్”కార్యక్రమం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని పేర్కొన్నారు.
గతించిన వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యుల జన్మదినాలు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా కూడా అల్పాహార పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు వీటిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని అనేకమంది ఆర్థిక సహాయం అందిస్తూ కార్యక్రమానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.
పేదల ఆకలి తీర్చడమే ప్రధాన ఉద్దేశంగా లయన్స్ క్లబ్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు.
–కార్యక్రమంలో పాల్గొన్న దాతలు లయన్స్ క్లబ్ సభ్యులు:–
ఈ కార్యక్రమంలో దాతలు గాజుల రాజేష్ ఉషారాణి గాజుల శ్రీను లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి ,కోశాధికారి చిలుకూరి కాశీనాథ్ సీనియర్ జెర్సీ గాజుల ఉషారాణి, సీనియర్ లయన్స్ సభ్యులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, నీలా బుచ్చయ్య ,కర్నాటి గోవర్ధన్ లకుమారపు మల్లయ్య, జైపాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు దినేష్ భీష్మాచారి ,నల్లగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe