సెప్టెంబర్ 29, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar

– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 28, త్రినేత్రం న్యూస్. సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్–నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చందంపేట మండలం చిత్రియాల గ్రామ పంచాయతీ సర్పంచ్ చాట్ల చిరంజీవిని సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రమావత్ రవీంద్ర కుమార్ శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ…..నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి అని రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ బీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్, సర్పంచ్ రమావత్ కిషన్, మాజీ సర్పంచ్ కొండల్ రెడ్డి, బాణావత్ భారత, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ ఇంట్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు కురిపించే శ్రీ సంపూర్ణ వాస్తు యంత్రం!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page