
Cobra Enters the Temple : తూర్పుగోదావరి జిల్లా: త్రినేత్రం న్యూస్: నవంబర్ 13 ; రాజమహేంద్రవరంలో సారంగధర మెట్టపై వెలసినటువంటి సారంగధరేశ్వరస్వామి ఆలయంలో నాగుల సవతి సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంగణంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము కనిపించింది.
ఈ పండుగ పర్వదినాన ఆ సర్పం దర్శనం ఇవ్వడంతో భక్తులు స్వామి అనుగ్రహంగా భావించారు. ఆ సర్పానికి భక్తితో దండాలు పెట్టారు. అనంతరం అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe