
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్
Steel for Temple Construction : చింతపల్లి నవంబర్ 13, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తీదేడు గ్రామంలోని శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ దక్షిణ మండప నిర్మాణ పనుల్లో భాగంగా తీదేడు గ్రామ మాజీ ఎం పి టీ సి బూర్గు ధనమ్మ భర్త కీ”శే” బూర్గు పెద్ద మల్లయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రణవ గ్రూప్ అధినేత బూర్గు రవికుమార్ స్లాబ్ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్టీల్‌ను దాదాపు 4 లక్షల విలువగల స్టీల్ అందించడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ అభివృద్ధికి భక్తిశ్రద్ధలతో ముందుకు వచ్చి సహకారం అందించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు,గ్రామంలోని దేవాలయాల అభివృద్ధికి దాతలు అందించే సహకారం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.
ఈ సందర్భంగా బూర్గు రవికుమార్ కి,వారి కుటుంబ సభ్యులకు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని,ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఆలయ అభివృద్ధికి సహకరించే ప్రతి దాతకు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe