జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట, టీడీపీలోకి వైసీపీ నేతలు వరుస కట్టారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. అదివారం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో 4వ వార్డు ఇంచార్జ్ గుండు వీర తాతరాజు , అధ్వర్యంలో అదే వార్డుకు చెందిన వైసీపీ ఇంచార్జ్ పసుపులేటి వెంకట్రావు మరియు వార్డు వైసీపీ కార్యకర్తలు అయినటువంటి పడాల సుజాత, ఆరేటి నాగపుల్లారావు, అంగర ప్రసాద్, దాసరి మణికంఠ, సుంకర సతీష్, అంగర అనంతలక్ష్మి, ఆరేటి దుర్గానాగలక్ష్మి, తుపాకుల సతీష్, దాసరి జ్యోతి, దాసరి స్వామినాయుడు(చిన్ని), ఎరుబండి అనంతలక్ష్మి, పి.తులసి లు ఉన్నారు.

రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, స్వయంగా తెలుగుదేశంపార్టీ కండువాలను వీరందరికి కప్పి టీడీపీ లోకి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ మంచి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట పట్టణ అధ్యక్షులు మత్సా నాగబాబు, 4వ వార్డు అధ్యక్షులు పొలమూరి శ్రీను, ఒబిలినేని హరిబాబు, గండి నాగేశ్వరరావు, గుమ్మడి రాము, పిల్లా తాతలు, తదితర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

joining TDP

You cannot copy content of this page