Student Siri Durga : రాష్ట్రస్థాయి పోటీలకు కాపవరం హైస్కూల్ విద్యార్థిని సిరి దుర్గ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. అనపర్తి,.. ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో కెరీర్ ఎక్స్‌ పో మరియు ప్రదర్శన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో “మై కెరీర్ మై ఫ్యూచర్” అనే అంశంపై పోస్టర్ ను వివరించే పోటీలో బిక్కవోలు మండలం కాపవరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సోడసాని సిరిదుర్గ చక్కని ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమస్ధానం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు పి. గోపాలకృష్ణారావు తెలియజేశారు.

రాజమండ్రిలో జరిగిన పోటీలో ఈ విభాగం లో ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసారని ఈ గట్టి పోటీలో సిరి దుర్గ ఎంపిక కావడం చాలా గొప్ప విషయం అని త్వరలో విజయవాడలో జరగబోయే పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా తరపున పాల్గొని రాష్ట్రస్థాయిలో కూడా విజయం సాధించి కాపవరం పాఠశాలకు జిల్లాకు పేరు తీసుకురావాలని కోరుకుంటూ మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ,పాఠశాల ఉపాధ్యాయులు కె.వీరరాఘవరెడ్డి, టి.వి.ఎస్.ఎన్ రెడ్డి, వై.బి.యస్.ఆచార్యులు, యస్.రవికుమార్, సి.హెచ్ కోమలి , కె.రవిభాస్కర రెడ్డి, డి.లోవకుమారి, సి.హెచ్.చైతన్య, డి రవిబాబు మరియు అధికారులు, పెద్దలు అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

student Siri Durga for state level competitions

You cannot copy content of this page

Scroll to Top