MLA Vegulla : వందేమాతర గీతానికి నేటికి 150 ఏళ్లు

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే వేగుళ్ళ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన…

త్రినేత్రం న్యూస్ నవంబర్,07. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, భారతదేశ స్వాతంత్ర్య సమరంలో జాతిని జాగృతం చేసిన “వందేమాతరం” గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తిఅయిన సంధర్బంగా మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన వందేమాతరం గీతాలాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఈ గేయం రణ నినాదంలా నిలిచిందన్నారు.

బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించి, స్వతంత్ర్య సమరయోధులకు మనో బలాన్ని ఇచ్చిందన్నారు. వందేమాతరం అన్న ఒక్క మాట బ్రిటిషర్లను భయపెట్టిందన్నారు. ఈరోజుకి వందేమాతరం ఆలపించినా, విన్నా నరనరాన ప్రతీ ఒక్కరికీ దేశభక్తి నిండి ఒళ్ళు పులకరిస్తుందన్నారు. పోరాట స్ఫూర్తిని నింపిన వందేమాతరం గురించి భవితరాలకు ఘనంగా తెలియజేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

150 years of the Vande Mataram song

You cannot copy content of this page

Scroll to Top