YS Sharmila Reddy’s Yatra : వైఎస్ షర్మిళారెడ్డి యాత్రకు విశేష ప్రజా స్పందన

TRINETHRAM NEWS

హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు
బాలేపల్లి మురళీధర్‌కు చిరు సత్కారం..

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం: దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా.. రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిళమ్మను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం కావడం పట్ల వారు హార్షాతిరేకాలు వ్యక్తం చేసారు.

స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణా రాష్ట్రంలోని వికారాబాద్‌లో డిసిసి జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించారని తాను వాటికి హాజరైనట్టు తెలిపారు. ఇకపై అన్ని తాను రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని అక్కడ జరిగిన సమావేశం ద్వారా ఉత్తర్వులు అందుకున్నట్టు తెలిపారు. ముఖ్యమైన నగరాలు, కార్పొరేషన్ల పరిధిలోని అధ్యక్షులను డిసిసిలుగా కాంగ్రెస్ పరిగణిస్తోందన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ శిక్షణా తరగతులకు హాజరై తమతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఆత్మీయంగా మాట్లాడారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం, రాజానగరంలో జరిగిన షర్మిళారెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, ఇన్‌చార్జ్ కాకర్ల హరిబాబు విజయవంతం చేసారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆమె చేపట్టిన యాత్రకు విశేష ప్రజా స్పందన వచ్చిందన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ షర్మిళ యాత్ర సాగిందన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆమె స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. ఈ పథకాన్ని ఉద్దేశ్యపూర్వకంగా నిర్వీర్యం చేసి ఉపాధి కూలీలకు దెబ్బకొట్టాలని కేంద్రం భావించడం దారుణమన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ పిలుపు మేరకు ఘర్ వాపస్ ఆవో కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దానిలో భాగంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి దూరంగా ఉన్న వారందర్నీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. చంద్రబాబు, జగన్ సహా అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారేనని, తిరిగి వచ్చిన వారందరికీ సముచిత గౌరవం కల్పిస్తామన్నారు.

ఇకపై పార్టీ కార్యక్రమాలు కూడా విస్తృతంగా కొనసాగుతాయని, కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, మేడవరపు భద్రం దొర, సింధియా రాణి, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిలైన బాలేపల్లి మురళీధర్‌కు దుశ్శాలువాలతో చిరు సత్కారం చేసి అభినందనలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YS Sharmila Reddy's Yatra receives special public response

You cannot copy content of this page

Scroll to Top