త్రినేత్రం న్యూస్, మురమండ, మార్చి 12: మురమండ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు మరియు గ్రామ రైతులకు తెలియజేయునది ఏమనగా, ఈ నెల 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు శుభమస్తు ఫంక్షన్ హాల్, రాజమహేంద్రవరం లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు కడియం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో అన్నదాత సుఖీభవ మూడో విడతలో భాగంగా రైతులకు ₹6000 నిధుల విడుదల కార్యక్రమం జరుగనుంది.
ఈ కార్యక్రమాలకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా మురమండ గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవళ్ళ రామ్మోహన్ (రాంబాబు) మాట్లాడుతూ, పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు మరియు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


