ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలకు మేరకు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. టిపిసిసి పిలుపుమేరకు స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బిజెపి పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లాకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉద్దేశించి అతిధులు మాట్లాడుతూ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవికుమారు కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ మరియు పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్
హాజరై మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికా కేసులో ఈడి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ చేర్చడం దారుణమని మండిపడ్డారు కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన నుండి కాంగ్రెస్ పై దాడులు కొనసాగుతున్నాయని అన్నారు బిజెపి నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటికైనా బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసన చేపడుతామని హెచ్చరించారు అన్ని పత్రిక నడిచిన విధంగానే నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిచిందని సామాజిక దృక్పథంతో జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన కొన్ని ఆర్థిక ఇబ్బందులతోని పత్రిక మూతపడి చాలా సంవత్సరాల అయిందని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత మల్లయ్య, ముస్తఫా, పాతిపల్లి ఎల్లయ్య, గట్ల రమేష్, పెద్దెల్లి ప్రకాష్ తేజస్విని, దిటి బాలరాజు, జాలి రాజమణి, బాల రాజ్ కుమార్, నాయిని ఓదెలు యాదవ్, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, యుగంధర్, సింహాచలం, కౌటం సతీష్, నజీముద్దీన్, కూడిదల శివ, ఉదయ్ రాజ్, దాసరి విజయ్, ఎండి యాకూబ్, ధూళికట్ట సతీష్, ఫజల్ బేగ్, ఘనముక్కుల తిరుపతి, గుంపుల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, అనుమ సత్యనారాయణ, గుమ్మడి రవి, అల్లి శంకర్, మాలెం మధు,కనుకుంట్ల అశోక్, ఆడేపు రవి, మోహిత్ సన్నీ, బోర్లే శ్రీనివాస్, ఆరే శ్రీనివాస్, లావణ్య, మోబిన్, చెప్పరి శ్రీనివాస్, బాబు మియా, దొంతుల కిరణ్, ఎండి గపూర్, యాకోబు, పూసాల శ్రీనివాస్, అనిల్, మహమ్మద్, హైమావతి, పద్మ, తమ్మెట సప్న, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


