అక్రమ సారా, గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా
త్రినేత్రం న్యూస్, రాష్ట్ర డీజీపీ, ఐజీ, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ సుంకర్ మురళి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటనియోజకవర్గంలో పోలీసు అధికారులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆలమూరు ఎస్‌ఐ జి. నరేష్, రావులపాలెం,కొత్తపేట ఎస్‌ఐలు సురేంద్ర, చంటి బాబు మరియు రావులపాలెం సర్కిల్, కొత్తపేట సర్కిల్ పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ అనేది ఒక ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు పోలీసులు చేపట్టే ప్రత్యేక తనిఖీ కార్యక్రమం. ఈ ప్రక్రియలో ఆ ప్రాంతంలోని ఇళ్లు, వాహనాలు, వ్యక్తుల వివరాలను పరిశీలిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటారు అని తెలియచేసారు.
ఈ నేపథ్యంలో జొన్నాడ తారక రామ నగర్ ప్రాంతంలో తెల్లవారు 4 :30 నిమిషాలకు మొదలైన కార్యక్రమం లొ పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అక్రమ సారా తయారీ, గంజాయి విక్రయం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని సుమారు 22 వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీజ్ చేసిన వాహనాలకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి ఇస్తామని తెలిపారు.ఆయా ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీసులు కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


