Women’s Health is Important : మహిళలు ఆరోగ్యం ముఖ్యం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట:మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు.స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండపేట 20వ వార్డు అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళ పాత్ర చాలా కీలకమైనదని పేర్కొన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటె తమ కుటుంబాలు కూడా ఆరోగ్యకరమైన వాతావరణం లో ఉంటాయన్నారు.కొంతమంది మహిళలు సిగ్గు,బిడియంతో పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతున్నారని దాని వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుందన్నారు.

మహిళలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవలన్నారు. తద్వారా ఆదిలోనే రోగానికి తగిన వైద్యం దొరుకుతుందన్నారు. ప్రభుత్వాలు పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.అర్బన్ హెల్త్ సెంటర్ లో ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వి. భవాని,ఆసుపత్రి సిబ్బంది,ఎ.ఎన్.ఎమ్ లు,అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు,అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Women's health is important

You cannot copy content of this page

Scroll to Top