Agricultural Drones : వ్యవసాయ డ్రోన్లు పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, సెప్టెంబర్ 20, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట పొలాలకు పిచికారి చేసే డ్రోన్ లు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పాల్గొని రైతులకు డ్రోన్స్ ను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మండపేట మండలానికి సంబంధించి 3 డ్రోన్లు పంపిణీ చేశామన్నారు. వీటి ఖరీదు రూ.29,40,000/-లు కాగా ప్రభుత్వం సబ్సిడిగా రూ.23,52,000/-లు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, మండపేట పిఎసిఎస్ చైర్మన్ కుక్కల రామారావు, టేకి పిఎసిఎస్ చైర్మన్ మేడిశెట్టి శ్రీనివాస్, ఎండిఓ కె.సత్యనారాయణ, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of agricultural drones

You cannot copy content of this page

Scroll to Top