అమలు కాని హామీలిచ్చి
గద్ద ఎక్కరు…
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజం…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట : కూటమి ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఏమి సాధించారని విజయోత్సవాలు నిర్వహించారని మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. మండపేట మునిసిపల్ కార్యాలయంలోని చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి ఛాంబర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద వాడి బలహీనత ను ఆసరా గా చేసుకొని అమలు కాని హామీలు ఇచ్చి అధికారం లో వచ్చారని ఆరోపించారు. జగన్ వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని, కూటమి ఇచ్చిన హామీలు నమ్మి ఓటేసి ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ నీ నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు.టౌన్ కు కిలో మీటర్ దూరంలో ఉండాల్సిన మద్యం దుకాణం లు ఊరు మద్యలో కి తెచ్చినందుకు విజయోత్సవాల అంటూ ఎద్దేవా చేసారు.మునిసిపల్ కార్యాలయం చుట్టూ మద్యం షాపులు బాగా నడుస్తున్నాయని ఉత్సవాలు చేశారా అని ప్రశ్నించారు.రాష్ట్రానికి ఏమి వరగబెట్టారని నిలదీశారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లో విఫలం అయ్యారని ద్వజమెత్తారు. సూపర్ సిక్స్ అక్కడ అమలు చేశారని ప్రశ్నించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


