
Tribute Paid Jayashankar : గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి గా ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ నగర మేయర్ మహంకాళి స్వామి .. గోదావరిఖని కళ్యాణ్ నగర్ లో 40వ డివిజన్ కార్పొరేటర్ ఖజాంపురం జయప్రద రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సహకారానికి ఆచార్య జయశంకర్ సార్ యువతకు దిక్సూచిగా శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు జాతిపితగా నిలిచారని ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక దీక్ష దక్షలతో అభివృద్ధిగా పయనిస్తుందని పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్ చిరాల నాగరాజు మనమయ సంఘం నాయకులు, నారాయణ, వైశ్య సంఘం నాయకులు, బులియన్ మార్కెట్ నాయకులు, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe