త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, గురువారం పర్యటించారు. ఈ సంధర్బంగా ఆయన రాయవరం శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పీఎం శ్రీ నిధులతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదగా విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటును విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకులు వుండవిల్లి రాంబాబు, వల్లూరు శ్రీనివాసు, కోట వెంకటరమణ, దంతంశెట్టి బాల, కామన్ సురేషు, నేతల సురేష్, ఇందుకమిల్లి అరుణ్ కుమార్, చల్లా సత్యనారాయణ, బర్ల రాజు, బోడబల్ల శేషు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు (చిన్ని), కమిటీ మెంబర్లు, రాయవరం గ్రామ కూటమి నాయకులు,కార్యకర్తలు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అదనపు పధక సమన్వయకర్త(ఎపీసీ)సమగ్ర శిక్ష జి.మమ్మీ, డివైఈవో పత్తి రామలక్ష్మణుమూర్తి, ఎంఈఓ వై సూర్యనారాయణ, ఏఎంఓ పి.రాంబాబు, ఎంపీడీవో ఎన్.కీర్తి స్పందన, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


