త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట శెట్టిబలిజ సంఘం నాయకులు శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. మండపేట పట్టణం, 13వ వార్డులో శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణం నకు మున్సిపల్ నిధులు రూ.36 లక్షలు శాంక్షన్ చేయించటం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ కు పుష్పగుచ్చం అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజి మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, చైర్మన్ గా ఉండగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం నకు రూ.20.00 లక్షలు శాంక్షన్ చెయ్యటం జరిగిందన్నారు. అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందన్నారు. తరువాత పిల్లి సుభాష్ చంద్రబోస్, రూ.30.00 లక్షలు శాంక్షన్ చేస్తే తరువాతి వచ్చిన వైసీపీ నాయకులు ఆ నిధులను క్యాన్సిల్ చేశారన్నారు. కాని తమ కోరిక మేరకు ఇన్నాల్టికి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చొరవతో మరలా శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణం నకు రూ.36.00 లక్షలు శాంక్షన్ చెయ్యటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, మండపేట మార్కెట్ కమిటి చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, పలివెల వెంకన్న, సొసైటి చైర్మన్ కుక్కల రామారావు, ముసిని సత్యనారాయణ, కుక్కల భాస్కరరావు, ముసిని శ్రీనివాసరావు, ముసిని వెంకటేష్, కుక్కల సత్యనారాయణ, కుక్కల నాగబాబు, కుక్కల నాగేష్, కుక్కల శ్రీను, కుక్కల తిరుమలరావు, వాసంశెట్టి శ్రీను, మేడిశెట్టి శ్రీను, కుక్కల శ్రీను, చలబోయిన మాచరరావు, చలబోయిన వీర్రాజు, పిల్లి గంగరాజు, వల్లు రాజు, పలివెల జానికయ్య, గీసాల సత్తిబాబు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


