నిత్యవసర వస్తువుల ధరలు అవినీతి ,భూ ,మైనింగ్ ,మద్యం మాఫియాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం
కాకినాడలో గడపగడపకు సిపిఐ… ప్రారంభిస్తూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు
త్రినేత్రం న్యూస్.. కాకినాడ మార్చి :1… రాష్ట్రంలో బలమైన వామపక్ష రాజకీయ శక్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ను తీర్చి దిద్దుతామని ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని దీనికి ప్రజలు ఆర్థికంగా అహార్దికంగా సహాయ సహకారాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు.
ఆదివారం ఉదయం 11 గంటల నుండి స్థానిక రెల్లి పేట మున్సిపల్ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల నుండి గడపగడపకు సిపిఐ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు… అక్కడ నుండి రెండు వార్డులు 15 16 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వారి వద్ద నుండి పార్టీ ఉద్యమానికి విరాళాలు అడగడం జరిగింది
ఈ కార్యక్రమం ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ మార్చి ఒకటి నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు సిపిఐ పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నామని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు కాకినాడలో జరిగిన రాష్ట్ర సమితి సమావేశాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని మెడికల్ మాఫియా అరికట్టాలని అవినీతి వ్యతిరేకంగా భూ మైనింగ్ మద్యం మాఫియాలపై వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలని తీర్మానాలు చేసామని ఆ నిర్ణయాలలో భాగంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు కాకినాడలో ఉన్న 50 వార్డులతో పాటుగా సామర్లకోట పిఠాపురం జగ్గంపేట ఏలేశ్వరం ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతాల్లో గడప గడపకూ సీపీఐ కార్యక్రమం జరుగుతుందని మధు తెలిపారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు బొబ్బిలి శ్రీనివాస్ ,మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ భవాని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యనారాయణ బొబ్బిలి సత్యనారాయణ రాజేష్ నిమ్మకాయల మల్లేశ్వరరావు ఎస్ కుమారి భాగ్యవతి శ్యామల అమ్మాజీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


