ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Volleyball Kits Distributed

యువకులతో కలిసి వాలీబాల్ ఆడిన జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి

Volleyball Kits Distributed : అనంతగిరి,జూన్ 11, (త్రినేత్రం న్యూస్) : యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి అన్నారు. మండలంలోని ఎగువశోభ పంచాయతీ పరిధిలోని దండబాడు గ్రామంలో యువత అభ్యర్థన మేరకు బుధవారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.
జనసేన పార్టీ పంచాయతీ నాయకులు రామారావు, బొంజోబాబు, కిల్లో లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ యువతకు వాలీబాల్‌తో పాటు ఇతర క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా చిట్టం మురళి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు.
క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా వాలీబాల్ కిట్ల పంపిణీ అనంతరం చిట్టం మురళి యువకులతో కలిసి సుమారు పది నిమిషాల పాటు వాలీబాల్ ఆడారు. ఆయన యువతతో కలిసి ఆటలో పాల్గొనడంతో గ్రామంలో సందడి నెలకొంది. యువకులు ఉత్సాహంగా ఆటలో పాల్గొంటూ ఆనందం వ్యక్తం చేశారు.
గ్రామ యువత తమ అవసరాన్ని గుర్తించి క్రీడా సామగ్రిని అందించిన జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దండబాడు గ్రామంలో యువతకు క్రీడల పట్ల మరింత ఆసక్తిని పెంపొందించే కార్యక్రమంగా ఇది నిలిచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page