Unprecedented Reunion : పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

TRINETHRAM NEWS
unprecedented reunion of alumni

Unprecedented Reunion : డిండి (గుండ్ల పల్లి),మే 23, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994 -95 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక వి ఏ ఎస్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ,ఒకరికొకరు అభినందనలు తెలియపరచుకొని, విద్యార్థి దశలో తాము పొందిన అనుభూతిని వెలిబుచ్చారు.

ప్రస్తుతం వారు స్థిరపడిన ఉద్యోగ, వ్యాపార, ఇతర రంగాలలో తమ బాధ్యతలను గుర్తు చేసుకున్నారు .ఆనాటి ఉపాధ్యాయులు మాకు అందించిన ఉత్తమ విద్య, క్రమశిక్షణ తో మేము ఈనాడు ఈ స్థితిలో ఉన్నందుకు గర్వపడుతున్నామని, పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గురువుల సేవలను కొనియాడారు .

ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు ఎం రఘుమారెడ్డి ,వి జంగారెడ్డి ,వి శేఖర్ రెడ్డి, ప్రసాదులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు.సమాజంలో ఉత్తమ పౌరులుగా వ్యవహరించాలని, తాము చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ,తమ తల్లిదండ్రులకు ఉత్తమ సేవలు అందించాలని ,తమ పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.

తదుపరి పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మురళీమోహన్, మదన్మోహన్, సురేష్, తిరుపతయ్య, యాదయ్య, శ్రీపతిరావు , జంగయ్య, వెంకటేష్ ,లక్ష్మీపతి ,శేఖర్, కాసుల శ్రీనివాస్, రాజు, వెంకటేశ్వర్లు ,ఎన్ శ్రీను, రేణుక, తిరుపతమ్మ ,పద్మ, ఆసియా, యాదమ్మ ,శ్యామల, గౌసియా, అరుణ ,అమృత, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top