జూలై 7, 2026
TRINETHRAM NEWS
Donation to Government Pensioners Building

Donation : దేవరకొండ డివిజన్ ,మే 23, త్రినేత్రం న్యూస్. దేవరకొండ డివిజన్ పెన్షనర్స్ భవనంలో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో, ఇటీవల పదవీ విరమణ పొందిన రేబాక సదానందం రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పెన్షనర్స్ సేవాసదనమునకు, మొదటి అంతస్తు నిర్మాణ నిధికి రూపాయలు 10,000 విరాళం అందజేశారు .

రేబాక దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు.దేవరకొండ సంఘం బాధ్యులు పెన్షనర్స్ కు అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు.భవన నిర్మాణము ,పుట్టినరోజు వేడుకలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పెన్షనర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందని, వారి సేవలను మరువలేమని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు తాడిశెట్టి నరసింహ, అంకం చంద్రమౌళి, కోశాధికారి లింగయ్య ,ప్రచార కార్యదర్శి పగిడిమర్రి సత్యమూర్తి, సహ అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య , యూసుఫ్ షరీఫ్ ,పడమటి శాంతకుమారి, కంచర్ల నారాయణరెడ్డి ,ముసిని వీరయ్య ,నందులాల్, మాదాసు రాములు, మౌలానా, బూరుగులోకేష్, కర్నాటి సత్యనారాయణ, యాదయ్య, ఆలంపల్లి శ్రీనివాసులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page