1974-75 పదోతరగతి విద్యార్ధుల ఆత్మీయ కలయిక
నాటి సరదాలు సంతోషాలు గుర్తు చేసుకున్న స్నేహితులు
విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు సత్కారం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమండ్రి, జూన్ 29: రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ హైస్కూల్లో 1974-75 సంవత్సరం పదోతరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక సరదాగా సందడిగా జరిగింది.50 ఏళ్ళ తర్వాత కలిసిన విద్యార్థులు చదువులమ్మ చెట్టు నీడలో నాటి సరదాలను,చిలిపి సంగతులను,తరగతి గదిలో చేసిన అల్లరిని గుర్తు చేసుకుని చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. వైఎంవిఎ హాలులో ఆదివారం కలిసిన విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఈనాటి తమ ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.స్ధర్ణోత్సవ సంవత్సరంలో తిరిగి కలిసిన విద్యార్థుల అపూర్వ సంగమంలో ఆనాటి మధుర స్మృతులను, తిరిగిరాని బాల్యాన్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందంగా గడిపారు.
ఇప్పడు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో అడిగి తెలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకొన్నారు. ఆత్మీయ కలయిక ఇంత సంతోషంగా జరిగేందుకు పూర్వ విద్యార్ధులు మాజీ కార్పొరేటర్ మంచాల బాబ్జి,ఉదయగిరి భగవాన్,యలమర్తి సాయిరామ్, కోరుకొండ శ్యాంబాబు,చందులూరి నాగేశ్వరరావు,బోడా వెంకటరమణ స్వర్ణోత్సవ కమిటీగా ఏర్పడి అందరూ హాజరయ్యేలా చేశారు.కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు,సిద్దినీడి వీర్రాజు,కంతేటి కృష్ణారావు,బాలగురు భాగవతులు,గ్రంధి చలం,పోలినాటి వెంకటేశ్వరరావు,సూరత్తు వాణీరావు,పులవర్తి చిరంజీవి,గునిశెట్టి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


