Supreme Court : పిల్లల మిస్సింగ్‌ కేసులు పెరుగటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

TRINETHRAM NEWS
Supreme Court expresses deep concern

Supreme Court : త్రినేత్రం న్యూస్ : దేశంలో చిన్న పిల్లల మిస్సింగ్‌ కేసులు పెరుగటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా తప్పిపోతున్న పిల్లల సంఖ్య పెరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మిస్సింగ్‌ కేసులను కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. తమిళనాడులోని ఘటనపై దాఖలైన పిటిషన్‌ విచారణలో నిన్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.

పలు జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి భగభగలతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇండియా కూటమి కాదు.. ఇక కాంగ్రెస్సే: జగ్గారెడ్డి

భగవంతుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతూ, మతం పేరుతో సీట్లు గెలిచి అధికారం కాపాడుకుంటోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే రక్షణ కవచం అని ఈ కవచాన్ని తొలగించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రనే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు.

రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెబుతున్నారన్నారు. రాజ్యాంగం విషయంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు కీలకమైనవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఐటీ సంస్కరణలకు బీజం వేసింది రాజీవ్ గాంధీ అన్నారు. మరి మోడీ ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. పేదవవాళ్ల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెసేనన్నారు.

బీజేపీ నేతలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హామీ ఇచ్చినట్లు తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఓటు ఒకరికి వేసి మొక్కితే దేవుడు కూడా ఏమి చేయలేదన్నారు. విభజన హామీలు నెరవేరాలంటే తెలంగాణ, ఏపీలో ఇండియా కూటమిలు కాదని నేరుగా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని డిమాండ్ చేశఆరు. కాక్రోచ్ పార్టీ ఇప్పుడే మొదలైందని వారి ఉద్దేశం పూర్తిగా బయటపడాల్సి ఉందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top