విద్యార్థుల బాటలో ఉపాధ్యాయులు.
డిండి (గుండ్ల పల్లి) జనవరి 21 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని చదువు వైపు మళ్లించేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించారు.
పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారు నేరుగా విద్యార్థుల ఇళ్ళకి వెళ్తున్నారు.
తల్లిదండ్రులకు అవగాహన :- సుదీర్ఘకాలంగా పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లను సందర్శించిన ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించేలా చూడాలని వారిని పనులకు పంపకుండా బడికి పంపాలని కోరారు.
ఉన్నత శిఖరాలే లక్ష్యం: – ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులో వెనుక బడకూడదనే లక్ష్యంతోనే మేము ఈ వినూతన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు ఉపాధ్యాయులు స్వయంగా తమ ఇళ్లకు వచ్చి పిల్లల చదువు గురించి ఆరా తీస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాఠశాల సిబ్బంది తీసుకున్న ఈ చెరువును చూసి స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


