అరకులోయ డిసెంబర్ 16, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట పంచాయతీ దొండపాడు గ్రామానికి చెందిన గిరిజన బాలుడు పిట్టలి అజయ్(13)ను జిల్లా సైక్లింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. దినేష్ కుమార్ తెలిపారు. అరకు చలి ఉత్సవంలో భాగంగా బోర్రా గుహల నుంచి అరకు ప్రభుత్వ ఐటీఐ వరకు నిర్వహించిన 36 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలో అజయ్ ద్వితీయ స్థానంలో నిలిచాడు.
సోమవారం కలెక్టరేట్‌లో అజయ్, ఆయన తండ్రి పిట్టలి లైభన్ జిల్లా కలెక్టర్ కి కలిశారు, కలెక్టర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయంతో మౌంటెన్ ట్రయల్ బైక్ కొనుగోలు చేసి జిల్లాలో కొత్త సైక్లింగ్ ట్రైల్ రూట్లను ప్రచారం చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్వెంచర్ ఔత్సాహిక విద్యార్థి బాటం తేజస్వరరావు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


