అరకులోయ డిసెంబర్ 16, (త్రినేత్రం న్యూస్): కార్మిక హక్కులు రక్షణకై ఉద్యమించాలి సిఐటియు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు చట్టాలు రక్షణకై ప్రతిఎత్తున ఉద్యమించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు తెలిపారు ఈ మేరకు సోమవారం అరకు వ్యాలీ కేంద్రంలో సిఐటియు పథకవిష్కరణ చేశారు. సిఐటియు విశాఖపట్నంలో జరిగే 18వ అఖిలభారత మహాసభలు సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వాడు వాడల జెండా ఆవిష్కరణ పిలుపు మేరకు మండలంలో పద్మపురం, గిరిజన మ్యూజియం, జిసిసి సోపి యూనిట్, ఇతర చోట్ల జెండావిష్కరణ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పెద్ద ఎత్తున ఉద్యమించాలని అందుకు కేంద్రం తీర్పు నిరసనగా డిసెంబరు 31 నుండి జనవరి 4న వరకు జరిగే మహాసభలో చర్చించి ఉద్యమ ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు.
రైతులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా ఉద్యమించి నరేంద్ర మోడీ మెడలో ఉంచారని లేబర్ కోడ్స్ రద్దుకై కార్మిక వర్గం రైతు ఉద్యమం స్ఫూర్తితో ఉద్యమించాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటలు పని దినాన్ని 12 గంటలు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం చేసిందని వేతనాలు పెంచమంటే పెంచలేని ప్రభుత్వాలు కార్మిక వర్గంపై పని ఒత్తిడి పెంచి పెట్టుబడుదారులకి లాభాలు తెస్తున్నారని అన్నారు ఇటువంటి పాలకుల్ని భవిష్యత్తులో అధికారుల నుండి దూరం చేయాలని తెలిపారు జనవరి 4న విశాఖపట్నం భారీ ర్యాలీ బహిరంగ సభ కు కార్మిక వర్గం తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్రావు, ఐటీడీఏ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మగ్గన్న, సీతారం, జగ్గారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


