అనంతగిరి డిసెంబర్ 16, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలంలో గ్రంథాలయ అభివృద్ధికి సంబంధించిన అంశంపై ఉమ్మడి విశాఖ గ్రంథాలయ చైర్మన్ వన్నేం రెడ్డి సతీష్ కుమార్ ని జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయన చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యంగా అనంతగిరి మండలంలో అనేక విద్యాసంస్థలు ఉన్న నేపథ్యంలో, విద్యార్థులు మరియు పాఠకుల సౌకర్యార్థం మండల గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి అన్ని విధాలుగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గ్రంథాలయం అభివృద్ధి చెందితే విద్యార్థులకు జ్ఞానవృద్ధికి, పాఠకులకు అధ్యయనానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
దీనిపై స్పందించిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ వన్నేం రెడ్డి సతీష్ కుమార్, ఈ అంశంపై మండల రెవెన్యూ అధికారితో చర్చించి దఫాలవారీగా ప్రయత్నాలు చేసి గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులు, పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం చైర్మన్ వన్నేం రెడ్డి సతీష్ కుమార్ ని జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి, మండల కమిటీ నాయకులు లక్ష్మణ్, బుజ్జిబాబు, రామారావు దుస్సాలువ కప్పి ఘనంగా సత్కరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


